A9: న్యూస్ ఆర్మూర్ ప్రతినిది
- *దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్జిల్లా నిజమాబాద్, ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ఓ దారుణం చోటుచేసుకున్న విషయం విదితమే. మార్చి 23న రాసూరి లాస్య (20) ఎస్సీ వర్గానికి చెందిన వివాహితను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. మృతురాలి భర్త రాసురి రాకేష్ నాలుగు నెలల క్రితం ఉపాధి నిమిత్తం బైరాన్ గల్ఫ్ దేశం వెళ్లగా, మృతురాలు అత్తతో కలిసి ఉంటోంది. లాస్యకు ఏడు నెలల కుమార్తె ఉంది. అయితే ఎవరూ లేని మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి చొరబడిన హంతకులు పదునైన ఆయుధంతో ఆమె గొంతు నులిమి హత్య చేశారు. లాస్య మెడలో ఇంచుమించు నాల్గున్నర తులాల బంగారం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెల్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎస్.హెచ్ రవికుమార్ అధ్వర్యంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెల్సిందే. ఇట్టి సమాచారం తెలుసుకున్న జిల్లా అంబేడ్కర్ సంఘాల ప్రతినిధులు సోమవారం ఇంటికి వెళ్ళి బాధితులను పరామర్శించారు ఓదార్చారు. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేకుర్చాడానికి తమవంతు కృషి చేయనున్నట్లు నాయకులు తెల్పారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ప్రకాష్ అంబేడ్కర్ పార్టీ) జిల్లా అధ్యక్షులు డి.ఎల్ మాలజీ, గంగప్రసాద్ రజక, కాపు రాజన్న మాసం, మూల్ నివాసి మాలజీ తదితరులు ఉన్నారు.