..బాబాపూర్ ముదిరాజ్ వాడ లో ఘనంగా కామాదహన వేడుకలు
సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ బాల్కొండ నియోజకవర్గం
నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలోని బాబాపూర్ గ్రామం లోముదిరాజ్ వాడ లో ఆదివారం రాత్రి కామా దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. డప్పువాయిద్యాలతో గ్రామావిధుల్లో కామయ్య చిత్ర పాటంతో ఊరేగించి కామాదహనం నిర్వహించారు. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం.ఈ మాసం లో ప్రతి సంవత్సరం చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు.హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తాగులబెడతారు.ఈ వేడుకలలో గ్రామ పెద్దలు, యువతి,యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.