నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలకేంద్రం లో జనావాసం ప్రాంతం లో ఒక పైథాన్ వలలో చిక్కుకొని ఉన్నదని పొలీస్ వారికి సమచారం రాగానే సిబ్బంది తో కలిసి వెల్లి చూడగ అది 10 అడుగుల పెద్దదిగా ఉంది
.అక్కడ కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ఆవరణలో వలకు చిక్కుకుంది. వెంటనే ముప్కాల్ ఎస్ఐ భాస్కరఛారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు సమచారం ఇవ్వడం తో
నిజామాబాద్ నుండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గణేష్, బీట్ ఆఫీసర్ సురేష్ వాళ్ళు సిబ్బంది తో వచ్చి పామును రెస్క్యూ చేయడం జరిగింది. దానికి చికిత్స అందించి అడవిలో వదిలి వేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామ ప్రజలకి పొలీస్ వారీ విన్నపం, మీకు జనాలు నివసించు ప్రాంతాలలో ఎక్కడైనా వన్య ప్రాణులు కనపడితే భయపడకుండా సమచారం ఇవ్వండి. వాటిని మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహాయం తో రెస్క్యూ చేసి అడవిలో వదిలిపెడుతాము. ఈ కార్యక్రమంలో ముప్కాల్ ఎస్సై భాస్కర చారి, ముప్కాల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.