(కామారెడ్డి A9 న్యూస్, గైని శ్రీకాంత్)
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్ట్ షాపుల యాదేచ్చుగా మండల పరిధిలో గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు, లిక్కర్ దందాను కొనసాగించేందుకు బెల్ట్ షాపులను వారి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.
వైన్స్ షాపుల్లో సరుకు చేరువేస్తూ దానిపై కమిషన్లు ఇస్తూ కొత్తతరహాలో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. పట్టణ గ్రామ ప్రాంతాల్లో బెల్టు దొంగను కట్టడి చేసేందుకు ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ సిబ్బంది చూసిచూడనట్టుగా వ్యవహరిస్తు బెల్ట్ షాపులలో నిత్యం తనిఖీలు చేపట్టాలి కానీ ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ చూసి చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ పోలీస్ సిబ్బంది నిత్యం తనికి చేపడుతూనే ఉంది. అయినప్పటికీ బెల్టు దందా మాత్రం కొనసాగుతూనే ఉంది నిత్యం తనిఖీలు సదాశివనగర్ పోలీసులు బెల్ట్ షాపులకు వత్తాసు పలుకుతున్నారని వివిధ గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపులకు నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేస్తున్నారు. తుది బెల్ట్ షాప్ నిర్వాహకులకు భయం లేకుండా పోతున్న సదాశివ నగర్ పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్ల వివిధ గ్రామస్తులు సదాశివనగర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్ల గ్రామాల్లో గ్రామస్తులు ఆ గ్రామ వ్యక్తం చేస్తున్నారు. షాపులు సరుకు విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి విధితమే అయితే గడిచిన పదేళ్లల్లో సదాశివ నగర్ గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా చాలామంది అయ్యాయి వైన్ షాపులకు అనుమతిగా బెల్ట్ షాపుల నిర్వాహణ కొనసాగుతుంది ప్రతి గ్రామాల్లో 5 నుండి 6 మరొక కొన్ని గ్రామాలలో అయితే ఏకంగా 10 బెల్ట్ షాపులు దర్శనమిచ్చేవి పైగా వీటికి టైం లిమిట్ లేకపోవడం 24 గంటలు మద్యం లభించడంతో గ్రామాలలో ఎంతో మంది తాగుడుకు బానిస జీవితాలు చిన్నాబిన్నం చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా యువతిపై ఇవి తీవ్ర ప్రభావం చూపాయి అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి బెల్ట్ షాపులను తొలగించాలని గ్రామాలలో ప్రజలు కోరుతున్నారు.