నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 4:
ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైన్ స్టార్ హెల్త్ కేర్, జి.జి చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో హైదరాబాద్ నగరంలో లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్.ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి హాజరు కావడం జరిగింది.
ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో థైరాయిడ్, షుగర్ ఈసీజీ మరియు కంటి పరీక్షలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు, సేవ కార్యక్రమాలే లక్ష్యమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని ఆవిడ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఆర్ ఫౌండేషన్ సభ్యులు, నైన్ స్టార్ హెల్త్ కేర్ డాక్టర్స్, జి.జి చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్స్ పాల్గొనరు.