నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3:

* బేకరీ తినుబండారాల సీజ్….

* పంచనామా చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్….

* బేకరీ షాపును సీజ్ చేయకుండానే వెన్నుతిరిగిన అధికారులు….

ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ పెట్రోల్ పంప్ ఎదురుగానున్న డాల్ఫిన్ బెంగళూరు బేకరీ లో కేక్ లు, తినుబండారాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి సీజ్ చేశారు. ఆర్మూర్ లోని డాల్ఫిన్ బేకరీలో కుళ్ళిన కేకులు విక్రయిస్తున్నారని ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ తో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బేకరీ లోని రెండవ అంతస్తులు కేకులు తయారు చేసే గదిలో వెళ్లి పరిశీలించారు. దుకాణంలో విక్రయిస్తున్న కేక్ లు, ఆహార పదార్థాలను సేకరించి సీజ్ చేసి పంచనామా నిర్వహించారు. సీజ్ చేసిన శాంపుల్ పదార్థాలను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామన్నారు. 15 రోజుల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చట్టపరంగా సీజ్ చేస్తామని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ ఏఈ రఘు, సిబ్బంది పాల్గొన్నారు.

 

మాట మార్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్..

ఆర్మూర్ లోని డాల్ఫిన్ బేకరీ ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ తారా నాయక్ మొదట విలేకరులతో మాట్లాడుతూ

సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ సమక్షంలో చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ శాంపుల్ నివేదిక వచ్చిన తర్వాత బేకరీ దుకాణాన్ని సీజ్ చేస్తానని చెప్పడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *