కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 2:
కామారెడ్డి జిల్లా గాంధారి నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులు, ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ప్రభుత్వం సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా యువత ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించుకోవాలని తెలిపారు రుణాలు ఉద్యోగాలు షాపింగ్ ల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని చెప్పారు ఇలాంటి వాటిపై అవగాహన లేకుండా స్పందించి నష్టపోతున్నారని ఒకవేళ సైబర్ మోసానికి గురై డబ్బులు నష్టపోతే వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు. ప్రజలు ఆపద అత్యవసర సమయంలో డైల్ 100 కు కాల్ చేసి సహాయం పొందాలని ఆయన పేర్కొన్నారు, రోడ్డు భద్రత చర్యలు భాగంగా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం మద్యం సేవించడం రాంగ్ రూట్లో ప్రయాణం త్రిబుల్ రైడింగ్ లాంటివి చేయరాదని పేర్కొన్నారు శాంతి భద్రతల పరిరక్షణ అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన సూచించారు ప్రజలు సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని అతివేగంగా వాహనాలు నడపరాదని మైనర్లకు వాహనం ఇవ్వకూడదని గాంధారి ఎస్సై ఆంజనేయులు అన్నారు.