నిజామాబాద్ A9 న్యూస్, జనవరి 31:
ప్రగతిశీల యువజన సంఘం నిజామాబాద్ జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 33వ వర్ధంతి ని ధర్పల్లి మండల కేంద్రంలో ని రేకులపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరించి కిరణ్ కుమార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు.
ఈ సందర్బంగా ఏఐకేఎంఎస్ ఆర్మో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిట్ల కరల్ మర్క్స్ మాట్లాడుతూ, కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ చిన్న తనం నుండే విద్యార్థి ఉద్యమాల వైపు అకర్షితుడై ఈ దేశంలో నూతన సమాజం ఏర్పడాలని అందులో భాగంగానే తన వంతు క్రియాశీలక పాత్ర పోషించి కేవలం 23 సంవత్సరాల వయసులోనే నిజామాబాద్ జిల్లాలో గ్రామ గ్రామానికి తిరిగి యువజనలను కూడగట్టి యువజన సంఘాలు పెట్టినాడు.
చెడు వ్యసనాలకు గురికాకుండా గుట్కా, మట్కా, మందులకు వ్యతిరేకంగా యువకులను కూడగట్టి జిల్లా వ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించినాడు. నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన గుట్కా ఉద్యమం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి గుట్కా అమ్మకాలను బందు చేయించిన ఘనత ప్రగతిశీల యువజన సంఘానికి దక్కింది అని ఆయన అన్నారు.
కాజమోహినుద్దిను మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో సింగిల్ నెంబర్ లాటరీ వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది. అనేక గ్రామాల్లో గ్రామ సమస్యలను పరిష్కారం కోసం క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి కావున నేటి పాలకులు యువతను చెడు వ్యసనాలకు గురిచేస్తూ సమాజ అభివృద్ధి కొరకై ఆలోచించకుండా నేటి పాలకవర్గ పార్టీలు యువతతో చెలగాటమాడుతున్నారు అని అన్నారు.
కావున పాలకవర్గ పార్టీలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేటి యువతరం ఉద్యమించినప్పుడే, కిరణ్ కుమార్ కు నిజమైన నివాళులు అర్పించిన వారిమి అవుతాము అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పీవైల్ మండల నాయకులు సాయి కుమార్, జాకీర్, సాంబయ్య, శివరాజ్, రాములు, నరస గౌడ్, గంగాధర్, దేవదాస్, గంగారం, గంగాధర్, జగన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.