కామారెడ్డి A9 న్యూస్, జనవరి 31:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో వంటగదిలేక క్లాస్ రూమ్ లో వంట చేస్తున్న నిర్వాహకులు. వంటగది లేక సంవత్సరమవుతున్న క్లాస్ రూమ్ లో వంట చేస్తున్నామని వారు తెలిపారు. వంటగది నిర్మించాలని విద్యార్థులకు ఇబ్బందికరంగా తరగతి గదిలో వంట చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు పాఠాలు వింటున్నప్పుడు పొగ వారి తరగతి గది లోకి వెళ్తుందని అన్నారు. ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఇకనైనా స్పందించి ఉన్నతాధికారులు వంటగది నిర్మించాలని వారు కోరుకుంటున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ పాఠశాలలో ఏ సమస్యలు ఉన్నాయి చూసి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఉన్న వెంటనే మధ్యాహ్న భోజనం కు కావలసిన వంటగదిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *