నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మండలంలోని చేపూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల లో జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా “నమో యువ మద్ధత్ సమ్మేళనం” పేరుతో ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేవైఏం ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించుకున్నారు, ఈ కార్యక్రమం భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా యువ నూతన ఓటర్లను జాయిన్ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బిజెపి సీనియర్ నాయకులు అదిలాబాద్ ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏప్రలోభాలకు లొంగకుండా దేశ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోళ్ల గoగారెడ్డి మాట్లాడుతూ అవినీతి రహిత దేశం కోసం పాటుపడాలని నేటితరం మోడీ ఆధ్వర్యంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో వైద్య రంగాలలో దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్తావుంది ప్రతి యువత మోడీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది అని పేరుకోవడం జరిగింది, అనంతరం మోడీ వర్చువల్ ప్రోగ్రాం యువత ఎల్ఈడి ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించరు.
ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ ముందుగా ఈ దేశంలో ఉన్న యువతకు జాతీయ ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ దేశం ముందుకు వెళ్లాలంటే యువత యొక్క సలహాలు సూచనలు తనకు చేయాలని మోడీ తన శక్తి వంచన లేకుండా దేశ ప్రగతి కోసం కృషి చేస్తానని దానికోసం నూతన యువ ఓటర్స్ తన వెంట ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, ప్రోగ్రాం కోఆర్డినేటర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేష్, బీజేవైఎం నియోజకవర్గ ఇన్చార్జ్ దినేష్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు కలిగొట్ ప్రశాంత్, నరేష్ చారి, రాజశేఖర్, రాథోడ్, నిఖిల్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.