నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిఐఈఓ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మరియు నగర అధ్యక్షుడు అఖిల్ అధ్వర్యంలో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో గల ఓ ప్రైవేట్ భవనం చూపించి ఇదే ఆల్ ఫోర్స్ కాలేజ్ అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి అడ్మిషన్లు చేస్తున్నారు ఈ ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ కరీంనగర్ కేంద్రంగా ప్రారంభమైంది గత మూడు సంవత్సరాల క్రితం రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఒక మహిళ విద్యార్థినీ కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అదేవిధంగా పిటి సార్ కూడా చనిపోవడం జరిగింది. అలాంటి కార్పొరేట్ ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ని నిజామాబాద్ నగరానికి ఎట్టి పరిస్థితుల్లో రాణియం అనీ డిఐఈఓ హస్తంతో ఫ్లెక్సీలు పెట్టి ప్రజలను మభ్యపెడుతూ అడ్మిషన్లు చేయడం జరిగింది. వెంటనే ఫ్లెక్సీలు అన్ని తొలగించి మీడియా ముఖంగా డిఐఈఓ ఆ కాలేజీకి ఎటువంటి అనుమతులు లేవని వాటిలో అడ్మిషన్ తీసుకోవద్దని ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఫోర్స్ టెక్నో కాలేజ్ నగరంలోకి వచ్చినట్టయితే డిఐఈఓ ని సస్పెండ్ చేసే వరకు మా ఉద్యమం ఆపము అదేవిధంగా కాలేజ్ పై బౌతిక దాడులకి దిగుతాం హెచ్చరిస్తున్నాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ వినయ్ సర్వేశ్ వినీత్ తదితరులు పాల్గొన్నారు.