నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో లిల్లీపుట్ పాఠశాలలో అయోధ్య రామ మందిరం ప్రారంభ ఉత్సవాలు పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రాముడు సీత హనుమంతుడి లా చక్కగా రెడీ అయి వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభ ఉత్సవాలు దాని యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు అయోధ్య భారత దేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి అని అయోధ్య ఉత్తర ప్రదేశ్ లోని ఒక ముఖ్య పట్టణం అని శ్రీరామచంద్రుడి జన్మస్థలం ప్రస్తుతం రామ మందిరం నిర్మాణం కావాలనే ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైందని అక్కడ మసీదు నిర్మించి ఉండటం వల్ల వివాదాస్పదంగా మారిందని తెలియజేశారు అయోధ్య రామ మందిరం అయోధ్య ఆలయం ఎత్తు 121 అడుగులు మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు వెల్లడించడం జరిగింది రాళ్లతో మాత్రమే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని ఇది 500 ఏండ్ల కళా అని ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ గారు విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ గారు ప్రిన్సిపాల్ దాసు గారు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు