నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ నాయకులు, కార్యకర్తలచే కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గా నియామకమైన పెద్దోళ్ల గంగారెడ్డి గారికి పట్టు శాలువాలతో, పూలమాలలతో వారి గృహమునందు ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారి మరియు రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేల ఆశీస్సులతో తనను బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం చేసినందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ.నాపై ఎంతో నమ్మకంతో కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం చేసినందుకు రాబోయే కాలంలో కేంద్రంలో ,రాష్ట్రంలో అమలవుతున్న రైతుల పాలసీలను రైతుల వద్దకు తీసుకెళ్లి వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తానని.అదేవిధంగా రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఉద్యమాలు చేసి రైతులకు సహకరించే ప్రయత్నం చేస్తానని.అదేవిధంగా ఈ నెల 27వ తేదీన జాతీయస్థాయిలో కిసాన్ మోర్చా జాతీయ ఇంచార్జ్ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయస్థాయి కిసాన్ మోర్చా సమ్మేళనానికి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ చహర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.రాష్ట్రల కిసాన్ మోర్చా అధ్యక్షులతో సమావేశం రాష్ట్రంలో జరుగుతుందని.ఈ యొక్క సమ్మేళనం తర్వాత రాష్ట్రంలో నిర్వహించే ఉద్యమాల కార్యాచరణ జరుగుతుందని.ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి పార్టీ మరియు వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.