నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
బాల్కొండ మండలంలో ఉన్న రైస్ మిల్లులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం బాల్కొండ తహసిల్దార్ శ్రీధర్ నాగపూర్ శివారులో గల శ్రీ లక్ష్మీనరసింహ రైస్ రైస్ మిల్లు,అలాగే కిసాన్ నగర్ లోని భూమేశ్వర్ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యజమానులతో తహశీల్దార్ మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ మరియు రభి కి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యాన్ని గడువులోగా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్ఐ రాఘవేందర్, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.