నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం రోజు ముప్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు రంగవల్లులు, పతంగుల పోటీలు, వివిధ రకాల వేషధారణలను ధరించి ఆటపాటలతో అలరించారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు సంక్రాంతి విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోట ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ చవాన్, ఫసిఖాన్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.