నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని ఏప్రిల్ రోడ్డు లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో స్టేట్ లెవెల్ అండర్ 14 బాలురు,బాలికల స్టాఫ్ బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే పైడి రాకేష్ మాట్లాడుతూ విద్యార్థులు, విద్యార్థిని విద్యాతో పాటు జాతీయ క్రీడల లో కూడా ముందంజలో ఉండాలని చెప్పారు. నేటి విద్యార్థిని విద్యార్థులు రేపటి పౌరులు అని చెప్పారు. గురుకుల లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులు పై శ్రద్ధతో విద్య, క్రీడలలో ముందుండేటట్లు చూడాలని ఉపాధ్యాయులకు చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందాలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.