నిజామాబాద్ A9 న్యూస్:
జాతీయస్థాయి అండర్ 17 కబడ్డీ ఛాంపియన్ కు బానోత్ విష్ణు ఎంపిక
- ప్రజా జ్యోతి ఇందల్ వాయి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందల్ వాయి కీ చెందిన భానోతు విష్ణు జాతీయ స్థాయి అండర్ 17 కబడ్డీ ఛాంపియన్షిప్ కు ఎంపిక కావడం జరిగింది. ఈ పోటీలు జనవరి 7 నుండి 11వ తేదీ వరకు కామారెడ్డి పట్టణంలో జరగనున్నాయి. ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 44 బాలుర జట్లు పాల్గొననున్నాయి. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి. గ్రామ సర్పంచ్ పాశం నర్సింలు సత్తెమ్మ. ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్. పిఎసిఎస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి. ఎస్ఎంసి చైర్మన్ నామాల గంగాధర్. కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్. పాశం కుమార్. పిఎసిఎస్ డైరెక్టర్ మల్లారెడ్డి. విడిసి అధ్యక్షులు మోహన్ హాస్టల్ వార్డెన్ దేవేందర్. పాఠశాల ఉపాధ్యాయ బృందం. మరియు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ అభినందించారు.