నిజామాబాద్ A9 న్యూస్:
డిచ్పల్లి మండల్ సుధపల్లి గ్రామానికి చెందిన షేక్ రజియా అనే అమ్మాయి అనారోగ్యంతో బాధపడుతున్న తెలుసుకొని ఆమెకు లెన్స్ ప్రాబ్లం వల్ల బాధపడుతుంది అని కుటుంబ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ మాట్లాడుతూ మీరు వెంటనే హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేయించుకోవాలని కుటుంబీకులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యువజన విభాగం తరపున ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ యువజన విభాగం అధ్యక్షులు ఉమ్మజి నరేష్, జక్రన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పారీ వినోద్, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.