నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను అవమానపరుస్తూ తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, అనుకరించడం జరుగుతున్నటువంటి దృశ్యాన్ని రాహుల్ గాంధీ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఉపరాష్ట్రపతిని అవమానపరచడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడమైనది.

ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ధ్యాగ ఉదయ్ మాట్లాడుతూ….

ప్రజాస్వామ్యంలో మేధావుల దేవాలయమైనటువంటి రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ గా, ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కడ్ ను అనుకరిస్తూ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం తనను అనుకరిస్తూ వ్యంగంగా ఆహాభావాలను చూపించడం ఇంత అవమానకరంగా కళ్యాణ్ బెనర్జీ అనుకరిస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ వారించడంపోయి తన సెల్ఫోన్లో ఆ యొక్క ప్రదర్శనను చిత్రించడం ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరమైనటువంటి సందర్భమని. వెంటనే తృణముల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని, రాహుల్ గాంధీని డిస్మిస్ చేయవలసిన అవసరం ఉందని. మేధావులు ఉండేటటువంటి సభ, పెద్దరికంగా ఉండవలసిన వ్యక్తులు ఒక ఉపరాష్ట్రపతిని, రాజ్యసభ చైర్మన్ ను అవమానపరచడం సబబు కాదు కాబట్టి వెంటనే వీరిద్దరిని డిస్మిస్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ఆయా పార్టీలకు ఉందని. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.

ఈ కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *