పోతీన్‌పల్లి బర్రె మహేష్ మృతి – మానవతా విలువలతో స్పందించిన మిత్రబృందం….

On: Friday, August 8, 2025 11:36 AM

 

తూప్రాన్, మెదక్, ఆగస్టు 8(A9 న్యూస్):

మెదక్ జిల్లా చేగుంట మండలం పోతీన్‌పల్లి గ్రామానికి చెందిన బి. మహేష్ ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అందరినీ కలచివేసింది. తూప్రాన్‌లోని సుష్మా హాస్పిటల్‌లో గతంలో పని చేసిన మహేష్, మల్కాపూర్ గ్రామంలో ఆర్.ఎం.పి. వైద్యునిగా సేవలందిస్తూ జీవనం సాగించేవాడు.

మహేష్ మృతితో వృద్దులైన అతని తల్లిదండ్రులు బి. యశోద, లక్ష్మయ్య తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ నేపథ్యంలో, సుష్మా హాస్పిటల్ అధినేత లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ మానవత్వ దృక్పథంతో ముందుకు వచ్చారు. మహేష్ సహచర మిత్రులు కూడా సంఘీభావం తెలియజేస్తూ తమవంతు ఆర్థిక సహాయం అందజేశారు.

ఆర్థిక సహాయం వివరాలు:

మహేష్ కుమారుడు బి. మిటాన్షూ పేరపై పాన్ కార్డు దరఖాస్తు చేసి, కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు.

అందులో ₹25,000 డిపాజిట్ చేసి, బాండ్ పేపర్‌ను తల్లిదండ్రులకు అందజేశారు.

కుటుంబానికి బియ్యం, తినుబండారాలు అందజేసారు.

సహాయం అందించిన వారు: లయన్ డా. ప్రదీప్ సింహ, ముత్తిగల్ల రవీందర్, గుర్రం శ్రీకాంత్, కేతావత్ రవి, అరికెల సత్యం, ఏర్పుల పరమేష్, అంబటి విజయ్, గూల మహేష్, మల్లెల రాజు, ఆర్.ఎం.పి. నరేష్, గుండెల్లి వెంకటేష్, జింక రవి, కార్తీక్ తదితరులు.

ఈ ఉదంతం మానవతా విలువలు ఇంకా సమాజంలో బతికే ఉన్నాయని చాటిచెప్పింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన వారిని గ్రామస్తులు అభినందించారు. “హ్యాట్సాఫ్ టూ హెల్ప్ – ఫుల్ స్టాప్!” అంటూ సుష్మా హాస్పిటల్ వారు స్పందించారు.

08 Aug 2025

Leave a Comment