Tuesday, November 26, 2024

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వాక్యాలను ఖండించారు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ బ్యావత్ సాయి కుమార్ ఆధ్వర్యంలో, ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం అయినది. 

 

ఈ సందర్భంగా బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు నల్ల రాజారాం అందాపూర్ రాజేష్ మాట్లాడుతూ, నిన్న దళితులమని చెప్పుకునే జీవన్ రెడ్డి అనుచరులు బిజెపి దళిత వ్యతిరేకి అని మాట్లాడుతున్నారు అని మరి బీఆర్ఎస్ కు అనుకూలంగా అంటే మీకు అనుకూలంగా ఉంటే బీజేపీ మంచిది అదే మీరు చేసిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తే బిజెపి మంచిది కాదు అని చెప్తా ఉన్నారని.

 

మీరు ఎన్నికలలో ఓడిపోయి ఒత్తిడిలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదని. ఎంపీపీ ప్రభాకర్ నువ్వు అకస్మాత్తుగా బిజెపి కండువా వేసుకున్న రాజ్యాంగబద్ధంగా ఎన్నిక ప్రక్రియ ఎలా జరిగాలో అలా జరిగితే ఉంటే ఎంపీపీ గా ఉంటావు లేదంటే లేదు అంతేగాని అనవసరంగా బిజెపిపై అక్కసుకక్కడం సరి అయింది కాదని. ప్రభాకర్ నువ్వు ఎంపీపీ కాకముందు ఆటో నడిపే వాడివి మరి ఎంపీపీ కాగానే బీదవారికి ఇవ్వవలసినటువంటి దళిత బందును నువ్వు వ్యక్తిగతంగా తీసుకో లేదా అని అదేవిధంగా దళిత బంధు పేరిట కమిషన్ లు వసూలు చెయ్యలేదా అని అదేవిధంగా 12 నుండి 15 ఎకరాల పేదలకు ఇవ్వాల్సిన అసైన్డ్ భూమిని అక్రమంగా కబ్జా చెయ్యలేదా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది.

 

అంతేకాకుండా దళిత బంధు పేరుమీద వచ్చినటువంటి రెండు హార్వెస్టర్లను, రెండు ట్రాక్టర్లను సైతం నువ్వు తీసుకోలేదా అని బిజెపి ప్రశ్నిస్తోంది. ఇప్పుడు దళిత నాయకులు అని చెప్పే కొందరు నిన్నటి రోజు అంబేద్కర్ ముందు ధర్నాకు దిగడం ఆశ్చర్యంగా ఉందని ఎందుకంటే నిన్న ధర్నా కు దిగినటువంటి వ్యక్తులు గత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీ చూసుకొని ధర్నా నిర్వహించారని. మరి ఈ ధర్నా చేసిన వ్యక్తులకు గతంలో ఇదే అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ చౌరస్తాలో దళితులైన సత్యం ను మరియు రవి లను టిప్పర్ తో గుద్ది చంపినప్పుడు మీరందరూ ఎటుపోయారని. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలను అవినీతిని ప్రశ్నించినటువంటి ఓ దళిత నాయకుని యొక్క కారును తగలబెట్టినప్పుడు మీరందరూ ఎటుపోయారని ప్రశ్నిస్తూ.

 

ఎవరైనా ఇంతటి వారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాని, ఎంపీపీ ప్రభాకర్ గాని మరి ఎవరైనా గాని, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లయితే కచ్చితంగా వారికి చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను కూకటి వేళ్లతో బయటకు లాగి అవినీతిపరుల బండారాన్ని బయట పెట్టడం కచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో దళిత మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here