Tuesday, November 26, 2024

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కొక్కటి బయటపెడతాం…..

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్: 

*ఖబర్దార్ జీవన్ రెడ్డి …

 

*నీ పతనం మొదలైంది …

 

*ఆర్టీసీకి ఏడు కోట్లు బాకీ ఉన్నావు …

 

 *కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నీ మాల్ కు కరెంటు తీసేశారు …

 

 *మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కొక్కటి బయటపెడతాం …

 

*కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి …

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ అధికారులు సీల్ చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే, శనివారం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కార్యకర్తలు తో పాటు వచ్చి మాల్ వద్ద మాట్లాడడం జరిగింది.. జీవన్ రెడ్డి ఖబర్దార్ అంటూ.. మీ యొక్క అక్రమాలను ఒక్కొక్కటి బయటపెడతామని, నీవు 9 సంవత్సరాలు ప్రజలను ఎంతో భయపెట్టిచ్చావని, ఇప్పుడు ఆర్మూర్ ప్రజలు నిన్ను ఆర్మూర్ నుండి తరిమికొట్టారని అన్నారు. ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించి జీవన్ రెడ్డి మాల్ కట్టావని ఈ మాల్ రెంట్ ఆర్టీసీకి కట్టకుండా ఇన్ని రోజులు ఆర్టీసీకి నష్టం చేశామన్నారు. నీవు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రభుత్వానికి ఆర్టీసీ సంస్థకు బాకీ ఉండకూడదు నీకు తెలియదా అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో నామినేషన్ వేసేటప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. ఆర్టీసీకి 7 కోట్లు బాకీ ఉన్నాడని, రెండు రోజుల క్రితమే ఆర్టీసీ సిబ్బంది మల్ కు వచ్చి సీల్ చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్మూర్ లోనీ పతనం ప్రారంభమైందని గుర్తు చేశారు. అలాగే కరెంటు డిపార్ట్మెంట్ కి రెండు కోట్లు బాకీ ఉన్నాడని, కరెంట్ డిపార్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు వచ్చి కరెంటు తీసేయడం జరిగిందని అన్నారు, మీ అక్రమాలు, కబ్జాలు అన్ని ఒక్కొక్కటి బయటకు తీస్తామని అన్నారు. మీ అన్నదమ్ముల రౌడీయిజం, కబ్జాల పర్వం అన్ని ఇక నుంచి సాగవని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాల్ లో ఆర్టీసీ వాళ్లు వచ్చి మాల్ సేల్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కొక్కటి మొదలుకొని నీ యొక్క అక్రమాలన్నిటిని బయటపెట్టి ఆర్మూర్ లో కనిపించకుండా చేస్తామని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసేటోళ్లకు సపోర్ట్ చేస్తుందని, మా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని అన్నారు. కొంతమంది ఉద్యోగులు జీవన్ రెడ్డికి తొత్తుగా ఉన్నవారికి ప్రభుత్వ పరంగా, శాఖా పరంగా చర్యలు తప్పవని వినయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here