నిజామాబాద్ A9 న్యూస్:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగర్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పులాంగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాలులు అర్పించడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఉండ కులాలను వ్యత్యాసాలను తగ్గించటం తో పాటు ప్రజలందరికీ సరైనటువంటి ఫలాలను అందటం కొరకు మను వాదాన్ని ఎదిరించి అందరికీ సమానత్వాన్ని కల్పించటం కోసం భారత రాజ్యాంగాన్ని దేశ పౌరులకు అందించిన మహా వ్యక్తి, డాక్టర్ అంబేద్కర్ అని భారత పాలకులు భారత రాజ్యాంగాన్ని ఆమల జరుపకుండా సమాజంలో వ్యత్యాసాలను కొనసాగించటం కోసం మనువాద సిద్ధాంతాన్ని ఆచరించే పద్ధతుల్లో విధానాలను కొనసాగించటం వల్ల కులాల పేరుతో మతాల పేరుతో ప్రజలను విభజిస్తూ వైశ్యామ్యాలను రెచ్చగొట్టే విధంగా మత్తత్వ భావుజాలాన్ని పెంచడం కొరకు ప్రయత్నించటం జరుగుతుందని మతతత్వ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలందరూ సంఘటితంగా మనువాదాన్ని ఎదిరించాలని అప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయం నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ జిల్లా కమిటీ సభ్యులు పిసూరి, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.