Tuesday, November 26, 2024

ప్రభుత్వ భూములకు, ఇరిగేషన్ భూములకు అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని ధర్నా

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:    

భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జివి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ పాలకవర్గం వచ్చిన సుమారు నాలుగు సంవత్సరాల నుండి పెర్కిట్ మామిడిపల్లి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ భూములకు ఇరిగేషన్ భూములకు అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని అంతేకాకుండా, ఒక ఖాళీ ప్లాటుకు, ఒక ఇంటి నెంబర్ జోడించి డబ్బులు దండుకుంటున్న ఆ ఇంటి నంబర్ మున్సిపల్ రికార్డులలో లేకపోవడం ఆశ్చర్యకరమని మున్సిపల్ అధికారులకు ముడుపులు ముట్టిన వెంటనే మున్సిపల్ చైర్మన్ కు కూడా పెద్ద ఎత్తున డబ్బులు అందడంతో అక్రమంగా నంబర్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు అలాగే మున్సిపల్ కార్యాలయాన్ని నలుగురు పాలిస్తున్నారని అందులో ఒకరు పండిత్ వినీత, పండిత్ పవన్, పండిత్ ప్రేమ్ మరియు మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజేశ్వర్ రెడ్డి, వీళ్లు నలుగురు మున్సిపల్ కార్యాలయాన్ని రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చి పట్టణంలో ఒక్కొక్క పర్మిషన్ కి ఒక్కో ధర నిర్ణయిస్తూ ప్రభుత్వ భూములను కాచేస్తున్నారని ఆరోపించారు. సుమారుగా 100 కోట్ల అవినీతి జరిగిందని వెంటనే కలెక్టర్ (రాజీవ్ గాంధీ హనుమంతు) ప్రత్యేక శ్రద్ధ వహించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, కౌన్సిలర్లు సాయి కుమార్, ఆకుల శ్రీనివాస్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, పెద్దోళ్ల గంగారెడ్డి, భరత్ పీర్ సింగ్ కుకునూర్ లింగన్న, పాన్ శ్రీనివాస్, గాండ్ల సాగర్, నర్సారెడ్డి, పసుపుల సాయి, వాసు, దక్షిణామూర్తి, నవీన్, రాజేశ్వర్, కార్తీక్ సింగ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here