నిజామాబాద్ A9 న్యూస్:
అవినీతి చేసిన అ రోజు నా మరణం ఉన్నట్లే అన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
ఆర్మూర్ ఎమ్మెల్యే గా 29,323ఓట్ల మెజార్టీ తో గెలిచిన పైడి రాకేష్ రెడ్డి సోమవారం ఆర్మూర్ పట్టణంలో విజయోస్తవ ర్యాలీ నిర్వహించారు. వందలాది యువకులు ద్విచక్ర వాహనాలు, కార్లలో రావడం జరిగింది.
జై రాకేష్ అన్న, జై మోది, జై బీజేపీ నినాదాలు చేస్తూ కదిలినరు. మార్గ మధ్యలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పేర్కిట్ చౌరస్తా లో గజ మలను అభిమానులు వేయడం జరిగింది అంబేద్కర్ చౌరస్తాలో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ లో అవినీతిపరులకు చోటులేదు, ఎమ్మెల్యే గా ఎక్కడ లేని అవినీతి ఇక్కడ జరిగింది ఆని జీవన్ రెడ్డి చేసిన అవినీతి కి సామాన్య ప్రజలు భయంలో బ్రతికరు.
ఎమ్మెల్యే గ ఒక్క అవినీతి చేయను అని తన పుట్టినరోజు న చెప్పినట్లు జర్నలిస్టులకు భయం లేకుండా నిజాన్ని నిర్భయంగా రాయండి ఎల్లవేళల సహకరించండి అని కోరారు. ఆర్మూర్ లో గంజాయి లేకుండా పోలీసులు చూడాలి అని అక్రమ కేసులు పెట్టకుండా ఉండాలి అనిరౌడీలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని అన్నారు.
ప్రతి పార్టీ వారు స్వేచ్ఛగా నియోజకవర్గంలో తిరుగుతూ సమస్యలపై నిలదీయండి అని ప్రజలకు మేలు చేయడంలో అందరూ సహకరించగలరు అని కోరారు. 86పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరూ తన వారు అని ఇక పై పార్టీలకు అతీతంగా సేవ చేస్తా ఆని అలాగే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నెల రోజుల్లో ఆర్టీసి బకాయిలు చెల్లించాలని లేకుంటే డిపో కలి చేయాలని చెప్పారు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్జపుర్ శ్రీనివాస్, పలెపు రాజు, బుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.