Monday, November 25, 2024

బీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీలు ఒకటే….

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

– కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు…

– ఆర్మూర్ లో గుండాగిరిని తరిమికొట్టండి….

– 6 గ్యారంటీలను పక్క అమలు చేస్తాం….

– ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం ఖాయం….

– జీవన్ రెడ్డి ఆర్టీసీకి సుమారు రెండు కోట్ల 17         లక్షలు బాకీ ఉన్నాడని తెలుసా…?

– వినయ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి..

– మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్….. 

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో పోటీలో ఉన్న బీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీలు ఒకటేనని, ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఓటర్లు ఆలోచించి కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తెలిపారు.

ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శ్రావణ్ గార్డెన్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం లోని పోలింగ్ బూత్ స్థాయి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంఐఎం కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి బీఆర్ఎస్, బిజెపికి మద్దతు ఇస్తుంది కాబట్టి మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారు చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే ఓట్లు చీలిపోతాయని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లలో రెండు పడకల ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వక మోసం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో బిజెపి మూడో స్థానంలో ఉందన్నారు. ఆర్మూర్ లో వినయ్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ వినయ్ రెడ్డిగా భావించి బూత్ స్థాయిలో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బూత్ కమిటీ సభ్యులు పోలింగ్ రోజు అతి జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమరపాటుగా వ్యవహరించవద్దని, పోలింగ్ కేంద్రాలలోనీ ఏజెంట్లు నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు.

ఆర్మూర్ లో గుండాగిరిని తరిమికొట్టి స్వచ్ఛమైన వినయ్ రెడ్డిని గెలిపించాలన్నారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. 40 కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచి కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. కెసిఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మేడిగడ్డ నాణ్యత లేక కుప్పకూలిందన్నారు.

సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు రు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్, కర్ణాటకలో అమలు చేసిందన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అదే ఊపులో మహారాష్ట్రలో సైతం గెలుస్తామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తుందని, ప్రతి గృహానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కచ్చితంగా ఇస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సమక్షంలో వివిధ పార్టీల నుంచి రాజీనామా చేసిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… పోలింగ్ రోజు ప్రతి ఒక్క ఏజెంట్ పోలింగ్ బూత్ లో చాలా జాగ్రత్తగా ఉండవలెనని అన్నారు. వివిధ పార్టీల నాయకులు మిమ్మల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, మీరు ఎవరికి కూడా ప్రభావితం కావద్దని, మీరు ఏజెంట్ గా ఉన్నప్పుడు మీ గ్రామంలో సంబంధించిన ప్రజలు మిమ్మల్ని చూసి ఓటు వేయడం జరుగుతుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజలు గెలిస్తే… నేను గెలిచినట్టే అని ఈ సమావేశంలో తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీకి సుమారు రెండు కోట్ల 17 లక్షలు బాకీ ఉన్నాడని, ఈ విషయం అఫిడేట్లో చూపించలేదని అన్నారు. ఇతను పోటీ చేయడానికి అనర్హతుడిగా ప్రకటించాలన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత లేదంటే లీగల్ గా పోతామని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేను తరిమి కొట్టే సమయం దగ్గర పడిందని అన్నారు. ఆర్మూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రతినిధులు డాక్టర్ అంజలి, జహర్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ధర్మపురి సంజయ్, కాంగ్రెస్ నాయకులు గోర్త రాజేందర్, మార చంద్రమోహన్, యాల్ల సాయి రెడ్డి, మంథని శ్రీనివాస్ రెడ్డి, సాయిబాబా గౌడ్, మాజీ ఎంపీపీ ఇట్టడి భాజన్న, మండల పార్టీ అధ్యక్షులు జీవన్, విజయ్, మంద మహిపాల్, మహమూద్ అలీ, రవికాంత్ రెడ్డి, ఎస్.కె బాలు, మాజీద్, జిమ్మి రవి, మూగ ప్రభాకర్, నారాయణ, ఏఐసీసీ పీసీసీ ప్రతినిధులు నియోజకవర్గ నాయకులు బూస్తాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here