నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ మండలంలోని బికినెల్లి ఖండ్ గాం సిద్ధాపూర్ వివిధ గ్రామాల విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలె నాగేష్ మాట్లాడుతూ పిల్లల చదువులు ఖరాబ్ అవుతున్నాయి మీ రాజకీయాల కోసం ఇప్పటికే విద్య వ్యవస్థ బ్రష్టు పట్టింది ఈ పాలనలో అని ఆయన అన్నారు డిపో మేనేజర్ గారు వెంటనే స్పందించి విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.