నిజామాబాద్ A9 న్యూస్:

* ప్రతీ గుండెలో గులాబీ జెండా….

* పదేళ్ళలో నియోజకవర్గ రూపురేఖలే మార్చా….

* మంచైనా, చెడైనా అనుక్షణం మీ వెంటే ఉంటున్నా..

* మీ కోసం జీవితాంతం జీతగాడిలా పనిచేస్తా….

* కాంగ్రెస్ కు ఓటు కరెంటు కట్..సంక్షేమ పథకాలు         అవుట్….

* కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షం….

* కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు.. కోరితెచ్చుకునే                 అగచాట్లు….

* ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే          అభ్యర్థి జీవన్ రెడ్డి…

ఆర్మూర్ నియోజకవర్గం నమస్తే నవనాతపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి డొంకేశ్వరం మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. నికల్పూరు, కోమటిపల్లి, అన్నారం, సిర్పూర్ గ్రామాలలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి తనని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని గ్రామాల ప్రజలు మేళతాళాలతో బోనాలతో వందలాది మంది యువకులు బైకు ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపకు తిరిగి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామానికి రైతుబంధు, రైతు బీమా, షాదీముబారక్, పల్లె ప్రగతి, మన ఊరు మనబడి, ప్రతి కులానికి గ్రామ గ్రామానికి కుల సంఘాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో నిధులు ఇచ్చామని, తొమ్మిది సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేశామని, మళ్లీ గెలిపిస్తే రాబోయే ఎలక్షన్లలో 400 కే సిలిండర్ ఇప్పిస్తామని, సన్న బియ్యం పంపిణీ చేస్తామని, 62 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి శూన్యమని తెలియజేశారు. బీఆర్ఎస్ తోనే సంక్షేమ పాలన సాధ్యమన్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాలు దేశానికి ఆదర్శమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలు, వీడీసీ మెంబర్లు, ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *