నిజామాబాద్ A9 న్యూస్:

* బీఎస్పీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి…

 

* ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు…           

         

* దళితులు, మైనారిటీలు అందరం ఆలోచించి బిఎస్పీకి ఓటు వేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించగలం అన్నారు…       

               

* అందరూ బాగుపడాలంటే బిఎస్పీకి ఓటు వేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని అన్నారు…

 

* నియోజకవర్గంలో అభివృద్ధిని చేయడం మానుకొని తమ సొంత లాభాల కోసం నాయకులు పాటుపడుతున్నారన్నారు…

 

* నియోజకవర్గ అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని అవకాశం ఒక సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు…

ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గండికోట రాజన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని బిఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని సంతోష్ నగర్ కాలనీలో గల వడ్డెర సంఘంలో ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో

బీఎస్పీ జిల్లా కన్వీనర్ అరుణ జ్యోతి, బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీట్ల శ్రీనివాస్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు రవి, పట్టణ జనరల్ సెక్రెటరీ అల్లేపు రాజులు మాట్లాడుతూ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీ వడ్డెర కులానికి చెందిన బడుగు బలహీన వర్గాల నిరుపేద అయినా ఆయనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం దాన్ని నియోజకవర్గం బిసి బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులు, మైనారిటీలు అందరం ఆలోచించి బిఎస్పీకి ఓటు వేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించగలం అన్నారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దళితులు, బీసీలు అందరూ బాగుపడాలంటే బిఎస్పీకి ఓటు వేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని అన్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధిని చేయడం మానుకొని తమ సొంత లాభాల కోసం నాయకులు పాటుపడుతున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని అవకాశం ఒక సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ దుబాయ్ ఎన్నారై ప్రెసిడెంట్ బండారి గంగాధర్, దండుల భాజన్న, మక్కల సాయిలు, దండుల వెంకటి, రాపని నాగేష్, మక్కల సంతోష్, మజాల బుచ్చన్న, బండారి రమేష్, బండారి రాజన్న, మక్కల ఎల్లయ్య, యతర్ రాజు, మక్కల శ్రీను, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *