నిజామాబాద్ A9న్యూస్:
*న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య
సామ్రాజ్యవాద దేశాల అండతో జాతి అహంకారంతో ఇజ్రాయిల్ నేతా న్యాహు పాలస్తీనా ప్రజలపై కొనసాగిస్తున్న దాడులను వెంటనే ఆపాలని సిపిఐ సంపూర్ణ మద్దతు పలుకుదాం ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. పాలస్తీనా ప్రజల పోరాటానికి న్యూ డెమోక్రసీ సంఘీభావ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. ఆర్మూర్ పట్టణంలో, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు,అధ్యక్షతన పట్టణములో *ఒకటి నవంబర్ 2023 తేదీన సాధీ ఖాన్ ఫంక్షన్ హాల్లో* సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ, యుద్ధ ధర్మాలను విస్మరించి, ఇజ్రాయిల్ దుర్మార్గంగా గాజా లోని పాఠశాలలపై ఆసుపత్రుల పై అమానుష దాడులకు పాల్పడి వేలాదిమంది పిల్లల్ని, మహిళల్ని, సుమారు పదివేల మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుందని, 14 లక్షల మంది నిరాశ్రులయ్యారని, భయం గుప్పిట్లో బతుకుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హమాస్ ను చీమల నలిపిస్తామని అహంకారపు, పోకడలను ప్రజలే సమాధి కడతారని,నేతాన్యాహు కు
తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఉల్లంఘించి దురహంకారంగా వ్యవహరిస్తున్న ఇజ్రాయిల్ కు అమెరికా అండదండలు ఇవ్వడం, మరో దిక్కు ప్రపంచ శాంతి పేరుతో చిలక పలుకులు పలికి ప్రపంచ ప్రజలకు ప్రమాద మారిందని ఆయన అన్నారు.
పాలస్తీనా తమ దేశ రక్షణ కోసం వీరోచితంగా సాగిస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిన మోడీ సర్కార్, యుఎన్ఓ లో తటస్తతను పాటించడం విదేశాంగ విధాన ధర్మానికి విరుద్ధమని ఆయన అన్నారు. గత 70 సంవత్సరాల పైగా పాలస్తీనా ప్రజలు పోరాడుతూనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
ఫాసిస్టు విధానాలతో ప్రపంచ ప్రజలని ఎల్లకాలం అణిచి వేయలేరని,ఆయన అన్నారు. ప్రపంచ ప్రజలు,సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన జాతీయత,నినాదంతో ఉద్యమించాలని పాపయ్య పిలుపును యిచ్చారు.
ఈ సదస్సులు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు సూర్య శివాజీ,ఎండి. కాజామొహీనోద్దీన్,
ఆర్మూర్ డివిజన్ పార్టీ మరియు ప్రజా సంఘాల నాయకులు బాలయ్య, అబ్దుల్, కారల్ మార్క్స్, ఎస్ రవి,సురేష్ బాబు, ప్రిన్స్, ఎస్ వెంకటేష్, నిమ్మల భూమేష్,విపద్మ, చిట్టక్క, మణెమ్మ,మల్కీ సంజీవ్, సాగర్, దెవన్న, బాబురావు, భాను, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.