నిజామాబాదు A9న్యూస్ :
న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలను మేనిఫెస్టో పెట్టాలని దాసు డిమాండ్ చేశారు.
సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రజా సమస్యలు అనే అంశంపై సదస్సును ఆర్మూర్ పట్టణంలోని 30 అక్టోబర్ 2023న మెడికల్ అసోసియేషన్ హాల్లో సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలపై నిర్దిష్ట హామీతో మేని ఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకుల ధరల నియంత్రణ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ అధికారంలోకి రాగానే అమలు చేయాలని దాసు ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం లిఖించారని ఆయన అన్నారు. కెసిఆర్ ఇంటికో ఉద్యోగం, రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పేరుతో ఉన్న మూడు లక్షల ఉద్యోగ కార్మికుల్ని క్రమబద్ధీకరిస్తామని హామీ నీళ్ల మూటగా మారిందన్నారు. నిరుద్యోగ భృతి 3016 రూపాయలు అమలుకు నోచుకోలేదని ఆయన తెలిపామ. ధనవంతమైన రాష్ట్రం అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో కెసిఆర్ సర్కార్ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకం అంటూ ఊరించి చెప్పిన కేసీఆర్ లక్షలాదిమంది కార్మికులకు నిలువ నీడ లేకుండా చేశారని ఆయన విమర్శించారు. దేశంలో ఉన్న 40 కోట్ల ఉద్యోగ, కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేసేటట్లు బిజెపి, కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగులు భూములు పేదలకు పెంచాలని, ఉద్యోగ భర్తీలు చేసి ఉపాధి భద్రత కాపాడాలని, విద్య వైద్యరంగ సమస్యలను పరిష్కరించాలని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని దాసు డిమాండ్ చేశారు.
ఈ సదస్సులో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకులు యండి. ఖాజా మైనోద్దీన్ అరుణోదయ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్, పి వై ఎల్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు చిట్టక్క, మణెమ్మ, బుజ్జి మహిళా సంఘం నాయకులు ఎం లక్ష్మి, హైమది ఐఎఫ్టియు నాయకులు గంగాధర్, పాషా బాయ్ ప్రజా సంఘాల నాయకులు పి రాజేశ్వర్, లోకేష్, అలీమ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.