నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గురువారం రోజు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ జవాన్ల ఫ్లాగ్ మార్చ్ మామిడిపల్లి చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా జీరాయత్ నగర్, మున్నూరు కాపు సంఘం వరకు దాదాపు 3.5 కిలోమీటర్లు సివిల్ పోలీస్, బిఎస్ఎఫ్ జవాన్లతో కలిపి దాదాపు 350 మందితో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించినట్లు ఆర్మూర్ ఎసిపి జగదీష్ చందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ వచ్చే ఎలక్షన్లలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు వారి వారి కార్యక్రమాలను ప్రశాంతంగా కొనసాగించుకోవాలని, ప్రజలు పార్టీ నాయకులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఏ విధమైన దుశ్చర్యలు జరగకుండా రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఆర్మూర్ పట్టణంలో 60 వేల ఓటర్లకు, 15 మంది రౌడీషీటర్లు, అన్ని రకాల కమ్యూనిటీ గల్లీలలో అన్ని గల్లీలను కవర్ చేస్తూ ర్యాలీ నిర్వహించాం అన్నారు.
ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పోలీసులకు, బిఎస్ఎఫ్ జవాన్లకు, ఆర్మూర్ ఓటర్లకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ కల్మేశ్వర్ శింగ్నేవార్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ కేసీఎస్ రఘువీర్, ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి సురేష్ బాబు, ఆర్మూర్ డివిజన్ ఆర్మూర్, భీంగల్, సిఐలు, ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.