నిజామాబాద్ A9 న్యూస్:
మరణించిన మున్సిపల్ కార్మికునికి నష్టపరిహారం చెల్లించి ఉద్యోగం కల్పించాలి సిఐటియు డిమాండ్ నిన్నటి రోజు జట్టింగ్ మిషన్ పై పనిచేస్తున్న అంజయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానితో అతని కుటుంబానికి సంపాదించే ఆధారం కోల్పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం వచ్చిందని అందువల్ల మరణించిన అంజయ్య కుటుంబానికి మున్సిపల్ కార్పొరేషన్ తరపున 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి, అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా ప్రమాదం గురై హాస్పిటల్ లో కొట్టుమిట్టాడుతున్న గంగరాజు అనే కార్మికుడికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించి అతనికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు చంద్ర సింహ కార్యదర్శి భూపతి సిఐటియు నగర కో కన్వీనర్ డి కృష్ణ తో కలిసి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ విధుల్లో ఉండి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాన్ని ఆదరించాల్సిన అవసరం మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉన్నదని అందువల్ల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంటనే స్పందించి వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కనీస సౌకర్యాలు అందకుండా ప్రాణాల మీదికి తెచ్చుకోవడం జరుగుతుందని అందువల్ల ప్రమాదకరమైన విధులు నిర్వహించే వారికి తగిన తర్ఫీదునిచ్చి వారికి తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని ఆయన అన్నారు.
ప్రమాదానికి గురైన కార్మికులను ఆదుకోవటానికి చనిపోయిన అంజయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని నష్టపరిహారం కొరకు ప్రభుత్వానికి తెలియజేసి తగిన సహాయం చేస్తామని ప్రమాదానికి గురై హాస్పటల్లో చికిత్స పొందుతున్న కార్మికుని ఆదుకోవటానికి ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.