నిజామాబాదు జిల్లా a9న్యూస్.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజ వ్యతిరేఖ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా రైతు ఉద్యమాలు వస్తున్నాయని, ఎన్నికలలో మరోసారి ప్రజలను, రైతులను,మోసం చేయడానికి అనేక కుట్రలతో వస్తున్నారని వారి విధానాలను నిలదీస్తామని CPI ML న్యూడేమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. 15-10-2023 న డిచ్ పల్లి మండలకేంద్రంలో పార్టీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతు నిరుద్యోగి ప్రవళికది ఆత్మ హత్య కాదు అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే నని ఆయన అన్నారు.వరుసగా గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలను రద్దు చేస్తూ నిరుద్యోగ యువతతో BRS ప్రభుత్వం TSPSC ప్రజల ముందు తెలంగాణ సమాజం ముందు, ఉద్యోగుల ముందు వీరి రంగు బయటపడింది అని అయన అన్నారు.
తెలంగాలోనే సహకార రంగంలో కొనసాగి మూత పడిన సారంగాపూర్ చక్కెర కర్మాగారన్ని తెరిపించి నడిపిస్తామని అన్న మాటకు 9 ఏండ్లు పట్టిందని అన్నారు.95 యాక్టు ప్రకారం ఫ్యాక్టరీ పైన ఉన్న అప్పులను మాఫీ చేసి రైతులకు అప్పాజెపితే రైతులే నడుపుకుంటారని ఆయన అన్నారు.
రాష్ట్రం లో నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం గోరంగా విఫలం అయిందని అన్నారు
BRS అధికారం లోకి రాక ముందు 240 కోట్ల మద్యం ఆదాయం వస్తే, ఈరోజు 40 వేల కోట్ల ఆదాయం మద్యం ద్వారా పెంచుకుందని ఎక్కడ చుసిన గ్రామాలలో బెల్టు షాపుల ద్వారా ప్రజల్ని మద్యం మత్తులో ముంచుతుందని ఆయన మండి పడ్డారు.
పంటలు చేతి కొస్తున్న రైతులకు మద్దతు ధరలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తుందని అన్నారు స్వామి నాథన్ సూచనలు అమలు చెయ్యడం లేదని msp మద్దతు గ్యారంటీ చట్టాన్ని తీసుకవచ్చి రైతులకు లాభసాటి ధరలను అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతు పంటలకు మద్దతు ధరలను ఇవ్వలని సిఫార్సు చేసిన రాష్ట్ర ప్రభుత్వం BRS ప్రభుత్వం రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిచ్చారు
దళితులకు 3 ఎకరాలు భూమి గృహలక్మి నిరుద్యోగ భృతి తదిత పథకాలన్ని ప్రజల్ని మోసం చేయడానికి ఆయన అన్నారు రైతు ప్రజావ్యతిరేక పథకాలు చెప్పట్టిన ప్రభుత్వంలు మళ్ళీ మోసం చెయ్యడానికి కొత్త వాగ్దానలతో ముందుకు వస్తున్నాయని వారిని ప్రజలు నమ్మ రని భూమయ్య అన్నారు
ఈ కార్యక్రమంలో… రూరల్ కార్యదర్శి జేపీ గంగాధర్, AIKMS జిల్లా కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, నాయకులు T కృష్ణ గౌడ్, అగ్గు ఎర్రన్న, బండ మీద నర్సయ్య, చిన్నయ్య,B దేవ స్వామి,m భారతి,
v సాయినాథ్,D బన్సి తదితరులు పాల్గొన్నారు.