నిజామాబాద్ A9 న్యూస్:
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిసింది. రేపు వేల్పూర్ తన స్వగ్రమంలో మంజులమ్మ అంత్యక్రియలు జరపనున్నట్లు మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రశాంత్ రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.