నిజామాబాద్ A9 న్యూస్:
https://youtu.be/whJ0oC82vpQ?si=cCCMAwcTO0DZtyFs
ఆర్మూర్ పట్టణంలో గల జీవన్ రెడ్డి మాల్ ను క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఆర్మూర్ యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు సందర్శించడం జరిగింది. షాపింగ్ మాల్ లో ఏ రకమైన వస్తువులు ఎలా ఉంటాయో, ఎటువంటి వస్తువులు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎవరెవరు వినియోగిస్తారు వంటి అనేక అంశాలు ప్రత్యక్షంగా విద్యార్థులకు వివరించడం జరిగింది.
మొదటి అంతస్తులోని ఎలక్ట్రిక్ వస్తువులు, గ్రోసరీస్ మొదలగు వాటిని చూపిస్తూ ధరలను తెలియజేస్తూ వివరించడం జరిగింది. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మరియు ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు సందర్శించడం జరిగింది. దీనివలన సూపర్ మాల్స్ లో లభించే వస్తువుల గురించి అవగాహన కలుగుతుందని తెలియజేశారు.