నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని చేపూర్ గ్రామంలో క్షత్రియ పాఠశాలలో గురువారం బతుకమ్మ సంబరాలను, మరియు రావణ సంహర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల వైస్ చైర్మన్ ఆల్జాపూర్ లక్ష్మీనారాయణ, జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. వేదిక పైన క్షత్రియ విద్యాసంస్థల కోశాధికారి ఆల్జాపూర్ గంగాధర్, కార్యదర్శి ఆల్జాపూర్ దేవేందర్, స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహస్వామి, ఆర్మూర్ టీచర్స్ కాలని క్షత్రియ స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్, ఆసీను లైనారు.
ఈ సంద్భంగా కార్యదర్శి ఆల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంస్కృతి లో ఒక భాగమని, దేశంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించే రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహ స్వామి మాట్లాడుతూ పాఠశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించడం వలన విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి పై అవగాహన ఏర్పడుతుందని, తమ ప్రాంత ప్రాచీన సాంస్కృతిక చరిత్ర ఎంత గొప్పదో ఇటు వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, సమాజానికి అర్థమౌతుందని, ప్రకృతి తో ముడిపడిన పూలను పూజించే కార్యక్రమం అని అన్నారు.
పాఠశాల విద్యార్థులు ఎంతో లయబద్దంగా నృత్యం చేస్తూ బతుకమ్మ పాటలు పాడినారు. విద్యార్థులు నృత్య ప్రదర్శన మరియు ప్రత్యేకంగా హైస్కూల్ పిల్లలు నవదుర్గ రూపంలో చేసిన నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పాఠశాలలో రావణసంహార కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అల్జాపూర్ రాజసులోచన, జయంతి, అల్జాపూర్ జయంత్, పరీక్షిత్ క్షత్రియ పరివారం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీచర్స్ కాలని ప్రిన్సిపాల్ అనిల్ వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు.