నిజామాబాదు జిల్లా A9న్యూస్.
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి సహకారంతో SDF నిధుల ద్వారా విడుదలైన 25 కోట్ల రూపాయల నుండి నందిపేట మండలం ఖుదవంద్ పూర్ గ్రామ అభివృద్ధికి 45 లక్షల నిధులను SDF నిధుల ద్వారా కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మరియు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
గ్రామ పార్టీ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ… గత 60 సంవత్సరాలలో గ్రామానికి ఎన్నడు లేని విధంగా నిధుల వరద పారిస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మరియు నిధుల కొరకై కృషి చేసిన గ్రామ సర్పంచ్ కోల్కొండ చిన్న సాయన్న గారికి మరియు ఎంపీటీసీ గోదావరి ప్రవీణ్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామ అభివృద్ధికై పాటుపడుతున్న ఎమ్మెల్యే గారి వెంటే మేమంతా ఉండి ఆయన గెలుపుకు కృషి చేస్తామని మూడవసారి గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది.