నిజామాబాదు జిల్లా A9న్యూస్
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల ఒకరోజు దీక్ష ప్రభుత్వము అధికారులు తమ వైఖరిని మార్చుకోకపోతే పోరాటాన్ని ఉదృతం చేస్తాం. 12వ రోజు అంగన్వాడీ సమ్మెలో భాగంగా సమ్మెలో భాగంగా అంగన్వాడి టీచర్లకు ఒక రోజు రిలే దీక్షను అంగన్వాడీ యూనియన్ వ్యవస్థాపక నాయకులు కే రామ్మోహన్ రావు గారి చేత ప్రారంభింప చేయటం జరిగింది.
ఈ సందర్భంగా దీక్షలలో జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల నాయకులు సెక్టార్ లీడర్లు పాల్గొనడం జరిగింది. సందర్భంగా అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ గత 12 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తూ ఉంటే సమస్యలను పరిష్కరించే బదులు ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులపై ఆరోపణలు చేస్తూ మీరు గారు చట్టానికి దేశంలో ఎవరూ ఇవ్వనంత వేతనాలు ఇస్తున్నట్లు అబద్ధపు ప్రచారాన్ని చేసి అంగన్వాడీ ఉద్యోగుల పైన ఆరోపణలతో సమ్మెను విరమించాలని చెప్పటం సరైనది కాదని వెంటనే చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉమ్మడి జిల్లాలో ఉన్న పది ప్రాజెక్టుల్లో ఎక్కడ రాని సమస్యను డిచ్పల్లి ప్రాజెక్టు సి డి పి ఓ స్వర్ణలత గారు అంగన్వాడీ ఉద్యోగుల్లో ఒక బయోత్పత్తి వాతావరణాన్ని సృష్టిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఉద్యోగాలను తీసేస్తానని బెదిరిస్తున్నారని తన వైఖరిని మార్చుకోకపోతే జిల్లా వ్యాప్త ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే దేవగంగు జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ జిల్లా కోశాధికారి చంద్రకళ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మెను విరమించేది లేదని ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆందోళనను మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని అందుకు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని.
అధికారుల వేధింపులను మానుకొని సెంటర్ తాళాలను పగలగొట్టడం మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో వీరితో పాటు జిల్లా నాయకులు మంగాదేవి, శివ, రాజమ్మ, సూర్య కళ, సందీప, సరిత, లావణ్య, గోదావరి, అరుణ, తదితరులతోపాటు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.
ముందుగా తమ సమస్యల పైన నినాదాలు చేస్తూ నిరసనను వెలిబుచ్చడం జరిగింది.