నిజామాబాద్ A9 న్యూస్:
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సంతోష్ నగర్ లో ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులులర్పించడమైనది.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ….
కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ స్వతంత్ర పోరాటంలో తెల్ల దొరలకు వ్యతిరేకంగా సత్యాగ్రహ పోరాటంలో పాల్గొనడం జరిగిందని. అలాగే తెలంగాణలో సైతం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ కోసం సైతం పోరాటం చేసినటువంటి తాను నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నప్పటికీ అప్పటి కాంగ్రెస్ ఢిల్లీకి పిలిపించి తెలంగాణ రాష్ట్రం కావాల్నా, కేంద్ర మంత్రి పదవి కావాల్నా అని అడిగితే, తనకు తెలంగాణ రాష్ట్రం కావాలని కేంద్ర మంత్రి పదవి వద్దని తృనప్రాయంగా తిరస్కరించిన ఉద్యమ కెరటమని. కొండ లక్ష్మణ్ గాంధేయ మార్గంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయడం కారణంగా వీరిని ప్రేమగా అందరూ బాపూజీ అని కొండా లక్ష్మణ్ బాపూజీ అని పిలుస్తారని. కాని నయా నిజం కెసిఆర్ కొండా లక్ష్మణ్ బాబుజీ ఆశయాలను తుంగలో తొక్కి తానే బాపూజీ అని తన తొత్తులతో చెప్పించుకుంటూ ఉండడం బాపూజీనే కాదు తెలంగాణ ప్రజలను సైతం మోసం చేసిన వాడని. కావున కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా బీసీలకు క్షమాపణ చెప్పాలని. అంతేకాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క చరిత్రను ప్రతి తెలంగాణ వ్యక్తి తెలుసుకునేలా విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ప్రచురించాలని. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఉంచాలని. కొండా లక్ష్మణ్ బాపూజీ ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో తెలంగాణలో రజాకార్లకు తొత్తు అయిన కేసీఆర్ ను తెలంగాణ నుండి తరిమికొట్టాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్ణం కృష్ణా గౌడ్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వర్, ధోండి ప్రకాష్, ఓబిసి మోర్చా పట్టణ కార్యదర్శి భవాని రాము మరియు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
.