నిజామాబాద్ A9 న్యూస్:
నందిపేట్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేకంగా 12 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి నిధులతో ఫోర్ లైన్ సెంట్రల్ లైటింగ్, డివైడర్ గార్డెనింగ్ పనులు నడుస్తున్నాయి, మెట్రోపాలిటన్ డివైడర్ తో పాటు, ఇంపోర్టెడ్ గార్డెన్, అత్యాధునిక సెంట్రల్ లైటింగ్ తో, నందిపేట్ పట్టణం వెలిగిపోతుందని, 5.5 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మితమవుతున్నాయి, 3.5 కోట్లతో ప్రభుత్వ విద్యా సంస్థల ఆధునీకరణ జరుగుతుందని,
నందిపేట్ పట్టణంలో 15 కోట్ల రూపాయలతో 30 కుల సంఘాలు, 12 కోట్ల రూపాయలతో వివిధ కులాల మండల స్థాయి ఫంక్షన్ హాల్ నిర్మితమవుతున్నాయని నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ తెలిపారు. గత 60 ఏళ్లలో ఏ నాయకుడు చేయని అభివృద్ధి చేస్తున్న జీవన్ రెడ్డి ని 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ గ్రామపంచాయతీ వార్డు మెంబర్ మన్పూర్ భూమేష్, మాజీ సర్పంచ్ మజారుద్దీన్, గంధం సాయిలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమ్మడ ఉషన్న, బీఆర్ఎస్ యువ నాయకులు వుమ్మెడ అశోక్, ఏడ్డిగారి నరేష్, ఆర్మూర్ శ్రీకాంత్, ఎడ్డిగారిదినేష్, మంతెన శ్రీకాంత్, బుడ్డవరకల సందీప్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.