నిజామాబాద్ A9 న్యూస్:
బాల్కొండ నియోజకవర్గంలోని పల్లికొండ, ముచ్కూర్ గ్రామాలకు చెందిన కుల సంఘాల వారు మేము ప్రశాంత్ రెడ్డి కి అండగా ఉంటామని కారు గుర్తుకే ఓటు వేసి వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామని తీర్మానం చేసి తీర్మాన పత్రం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నరసయ్య, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుణవీర్ రెడ్డి లకి ఇవ్వడం జరిగింది.
పల్లికొండ గ్రామంలో నాలుగు కుల సంఘాలు, ముచ్కూర్ గ్రామంలో ఆరు కుల సంఘాలు వారి కుటుంబ సభ్యులతో సహా కలిసి వచ్చి తీర్మానాలు చేసి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుణవీర్ రెడ్డి వాళ్లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పల్లికొండ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారి పెద్ది గణేష్, సర్పంచ్ ఎనుపోతుల యమునా గంగారం, ఉప సర్పంచ్ ప్రశాంత్, ఎంపీటీసీ ఏశాల కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎంఏ షఫీ, నాయకులు కిషన్, అజయ్, దేవనపల్లి సుమన్, పిండి అశోక్, ముచ్కూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంతం గంగా గౌడ్, సర్పంచ్ బండి జ్యోతి శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఓజ్జం భూమేష్, ఎంపిటిసి లారీ రాజేశ్వర్, బిఆర్ఎస్ నాయకులు తులసి గౌడ్, జెన్ను కృష్ణ, డిష్ గంగాధర్, ఓజ్జం రమేష్, కిష్టా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.