నిజామాబాద్ A9 న్యూస్:
భారతీయ మజ్దూర్ సంఘ్ (బి ఎం ఎస్) ఆర్మూర్ మండల శాఖ అధ్యక్షులు సాయి రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ బీఐ ఆర్మూర్ కార్యాలయం ముందు విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…
కార్మికులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ. బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని. విశ్వకర్మ బ్రహ్మ యొక్క మానస పుత్రుడని. ఈ విశ్వానికి మూలాధారం అయినటువంటి వ్యక్తి ప్రతి చేతి వృత్తి వారికి అభయమిచ్చే, ఆశ్రయమిచ్చే దేవుడని.
సనాతన ధర్మంలో విశ్వకర్మకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం “ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కార్మికుల కోసం తీసుకురావడం జరుగుతాఉందని. ఈ యొక్క “ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన” కింద భారతదేశ కార్మికుల కోసం 30 వేల కోట్ల రూపాయల ప్రత్యేకమైన నిధులను విడుదల చేయుచున్నారని. కార్మికులకు ఎటువంటి అపాయాలు, దుర్ఘటనలు జరిగిన 6లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియ ఇవ్వడం జరుగుతుందని.
కార్మికులు బి ఎం ఎస్ నాయకుల ద్వారా కార్మిక కార్డును తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను ఉపయోగించుకోవాలని. ఈ యోజన కింద శిక్షణ తరగతులు నిర్వహించి ధూపత్రాలను ఇవ్వడం జరుగుతుందని. ఈ శిక్షణ 15 రోజుల వరకు ఉంటుందని. ఈ శిక్షణ సమయంలో పాల్గొనే ప్రతి కార్మికునికి రోజుకు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని. ఈ ఒక్క శిక్షణలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి 15వేల రూపాయల విలువగల పనిముట్ల కిట్టును ఇవ్వడం జరుగుతుందని.
ఈ శిక్షణ తరగతులు పూర్తి చేసినటువంటి కార్మికులకు మొదటి విడతగా 1లక్ష లోన్ ఇచ్చి 18 నెల రీపేమెంట్, రెండో విడత ట్రైనింగ్ పూర్తి చేసిన వ్యక్తులకు 2 లక్షల లోన్ ఇచ్చి 30 నెలల రీపేమెంట్ అంతేకాకుండా సంవత్సరానికి 5శాతం వడ్డీ వసూలు చేయడం జరుగుతుందని. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రతి కార్మికుడు ఉపయోగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్మికుల కోసం చేస్తున్నటువంటి పథకాలను ప్రతి కార్మికులు ఉపయోగించుకొని, ప్రయోజనం పొందాలని. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ని బలపరిచి మరోసారి ప్రధానమంత్రి చేయడానికై మనమందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి మాట్లాడడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిఎంఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.