నిజామాబాద్ A9 న్యూస్:
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఐ.పి.యస్, మోర్తాడ్, కమ్మరపల్లి, ఎర్గట్ల, భీంగల్, వేల్పూర్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లను ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు.
మొట్టమొదలు పోలీస్ సిబ్బంది నుండి గౌరవవంధానం స్వీకరించి, పోలీస్ స్టేషన్లోని అన్ని ప్రదేశాలను కలియదిరిగి స్టేషన్లో పరిశుభ్రతా ఎలా ఉందనే విషయం తెలుసుకున్నారు. అనంతరం రిసిప్షన్ కౌంటర్కు వెళ్లారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుడికి ఎలాంటి గౌరవం ఇస్తారు? వారి ఇబ్బందిని ఎలా తెలుసుకుంటారు? ప్రతీ ఫిర్యాదును అంతర్జాలంలో నమోదు చేయాలని, అనంతరం పోలీస్ స్టేషన్లో 5ఎస్ విధానం అమలు కోసం తీసుకుంటున్న చర్యలు క్షుణ్ణంగా చూశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతంరం పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ త్వరలో వినాయక చవితి, మిలాద్-ఉన్-నబీ పండుగల సందర్భంగా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సమస్యలు రాకుండ నిఘా వ్యవస్థను పటిష్ట పర్చాలని, ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం సిబ్బంది సాధకబాదలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిజామాబాదు ఆర్మూర్ ఎ.సి.పి, ఎమ్. జగదీష్ చందర్, భీంగల్ సి. ఐ. వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సి. ఐ. గోవర్ధన్ రెడ్డి, ఆర్మూర్ ఎస్. హెచ్. ఓ. సురేష్ బాబు, మోర్తాడ్, కమ్మరపల్లి, ఎర్గట్ల, భీంగల్, వేల్పూర్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐలు అనిల్ రెడ్డి, రాజశేఖర్, మచ్చిందర్ రెడ్డి, హరిబాబు, మరియు సిబ్బంది తదితరులు ఉన్నారు.