Thursday, November 28, 2024

అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శన

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శనను 16వ తారీకు శనివారం రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వరత్న బాబాసాహెబ్ అంబెడ్కర్ జీవితం, ఆశయాలు, లక్ష్యాలు పై హైదరాబాద్ లోని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్ఛమీ.

ప్రదర్శింపబడుతోందనీ అంబేద్కర్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ తెలిపారు. సమాజంలో సామాజిక సమానత్వం, సోదరభావం నెలకొల్పేందుకు తన జీవితపర్యంతం కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంత భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 కార్యక్రమాలను అన్ని జిల్లాల్లో ప్రదర్శింపబడుటకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.

అందులో భాగంగా రేపు సాయంత్రం 6 గంటలకు ఆర్మూర్ లోని క్షత్రియ ఫంక్షన్ హాళ్ళో జరగబోయే ఈ కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యులతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here