తెలంగాణ A9 న్యూస్:
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు ఆందోళనబాట పడుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు. పెండింగ్ బిల్లులు, కొత్త మెనూకు తగ్గట్టుగా బడ్జెట్ పెంచడంతో పాటు తమకు సరైన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.