నిజామాబాద్A9 న్యూస్:
భీంగల్ పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇటీవల రెండు రోజుల క్రితం ఫుట్ పాయిజన్ జరిగినటువంటి సమస్యపై మంత్రి ప్రశాంత్ రెడ్డి పాఠశాలను సందర్శించి. సమస్యలపై ఆరా తీసి అధికారులకు పలు సూచనలు చేశారు.
అలాగే విద్యార్థులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, వార్డెన్లు, పంట చాలా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.