ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు రామ్‌చరణ్. తన రెండో సినిమా ‘మగధీర’లో ద్విపాత్రాభినయం చేసేశాడు. ఇక ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్ అభినయం చూస్తే నిజంగానే చెవులు వినిపించవా? అనే డౌటొచ్చేస్తుంది. అంత నేచురల్‌గా చేశారాయన.
ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు రామ్‌చరణ్. తన రెండో సినిమా ‘మగధీర’లో ద్విపాత్రాభినయం చేసేశాడు. ఇక ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్ అభినయం చూస్తే నిజంగానే చెవులు వినిపించవా? అనే డౌటొచ్చేస్తుంది. అంత నేచురల్‌గా చేశారాయన. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామరాజు పాత్ర కూడా తేలికైంది కాదు. ఇప్పుడిదంతా దేనికంటే, ప్రస్తుతం చేస్తున్న ‘గేమ్‌ఛేంజర్’లో కూడా వైవిధ్యంగా కనిపించనున్నారట చరణ్. పైగా ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.
రెండో పాత్రకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని బయటకొచ్చాయి. అందులో చరణ్ 70ల్లో వ్యక్తిగా ఖద్దరు వస్ర్తాలు ధరించి సైకిల్‌పై వెళ్తూ కనిపించాడు. ‘మగధీర’ మాదిరిగానే ఇందులోని పాత్రలకూ అస్సలు పొంతన ఉండదని సినీవర్గాల టాక్. అలాగే అందులోని ఓ పాత్ర చరణ్‌కి ‘రంగస్థలం’ అంత పేరు తెచ్చేలా ఉంటుందని తెలిసింది. ఏది ఏమైనా తన తండ్రి చిరంజీవిలా ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్య నటుడిగా తన ఆకలి తీరే పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు రామ్‌చరణ్.