కేజీఎఫ్‌ ముందు వరకు యష్‌ పేరు పక్క రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా తెలీదు. ఇక కేజీఎఫ్‌ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ హిట్టవ్వడంతో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. యష్‌కు ఈ సినిమా తెచ్చిన స్టార్‌డమ్‌ అంతా ఇంతా కాదు.

 

కేజీఎఫ్‌ ముందు వరకు యష్‌ పేరు పక్క రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా తెలీదు. ఇక కేజీఎఫ్‌ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ హిట్టవ్వడంతో యష్‌ పేరు ప్రపంచమంతటా వినిపించింది. యష్‌కు ఈ సినిమా తెచ్చిన స్టార్‌డమ్‌ అంతా ఇంతా కాదు. దంగల్‌ దర్శకుడే యష్‌తో సినిమా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడంటే ఆయన క్రేజ్‌ ఏ లెవల్లో ఉందో తెలుస్తుంది. ఇక యష్‌ సైతం కేజీఎఫ్‌ తెచ్చిపెట్టిన సక్సెస్‌ను కాపాడుకోవాలని.. తొందరిపడి సినిమాలు చేయోద్దని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఏకంగా కొన్ని నెలలు సమయం తీసుకున్నాడు. ఫైనల్‌గా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని బెంగళూర్ టాక్‌.

నిజానికి ఈ లీక్‌ ఎప్పుడో బయటకు వచ్చింది కానీ.. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిసెంబర్‌ మూడో వారంలో ఘనంగా లాంచ్‌ కాబోతున్నట్లు టాక్‌. ఇక ఈ కథ గోవాలో జరిగే డ్రగ్ మాఫియా చుట్టూ జరుగుతుందట. కొన్ని నెలలుగా యష్‌ ఈ కథతోనే ట్రావెల్‌ చేస్తున్నాడట. మరీ ముఖ్యంగా కొన్ని నెలల కిందట గోవాకి వెళ్లి అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడట. అంతేకాకుండా గన్‌ షూటింగ్‌ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడట. ఇలా షూటింగ్‌ స్టార్‌ అయ్యే సరికి ఫుల్ ప్రీపేర్‌ ఉండాలని డిసైడ్‌ అయిపోయాడట. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై అఫీషియల్‌ ప్రకటన వచ్చే చాన్స్‌ ఉంది.

గీతూ మోహన్‌ గతంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది. అందులో మనకు బాగా తెలిసిన నివిన్ పాలీతో ముథూన్‌ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా తీసింది. నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా నివిన్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ సినిమాగా నిలిచింది. గీతూ మోహన్‌ దాస్‌ టేకింగ్‌, విజన్‌.. హీరో క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసిన తీరుకు మహామహులే ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు ఏకంగా యష్‌తో సినిమా చేస్తుందంటే ఇంకా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని సినీ లవర్స్ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *