కామారెడ్డి A9 న్యూస్:
డబ్బులు ఇవ్వనందుకు అమ్మమ్మను గొడ్డలితో నరికి చంపిన ఘటన నిజాంసాగర్ మండలం తెల్లాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అక్కమ్మ (70) అనే ఆమె ను మనవడు బాల పోచయ్య డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో గొడ్డలితో నరికి చంపాడు.
విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పున్న నారాయణ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. బాల పోచయ్య పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.